Mahesh Kathi, Pawan Kalyan fans war truns another way. Till now this contraversy was limited to only statements. Now goes Photo war in between them. Latest, Allu Aravind listed into this controversy. In this connection, Hyper Aadi posted seven questions to Mahesh Kathi.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, కత్తి మహేష్ మధ్య వివాదం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నది. ఆదివారం ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ నుంచి దర్శకుడు వివేక్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక మధ్యలో చర్చ నుంచి నిష్క్రమించిన కత్తి మహేష్‌కు సోషల్ మీడియాలో చుక్కెదురైంది. తన కుటుంబం గురించి లేవనెత్తిన ఏడు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆదివారం ఓ టెలివిజన్ ఛానెల్‌లో కత్తి మహేష్, లెజెండ్ మాటల రచయిత, దర్శకుడు వివేక్ మధ్య చర్చ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ చర్చలో మొదట కత్తి మహేష్ మాట్లాడారు. ఆ తర్వాత దర్శకుడు వివేక్ గురించి మాట్లాడుతూ.. లైవ్ కార్యక్రమంలో నీ మీద దాడి చేస్తే ఏం చేస్తావు అని అడిగాడు.
అందుకు కత్తి సమాధానం చెబుతూ.. పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాను అని అన్నాడు. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయాలి.. ప్రజల వద్దకు వెళ్లి చెప్పుకోవాలి అని వివేక్ ప్రతి సమాధానం ఇచ్చాడు.
ఆ తర్వాత రేణు దేశాయ్, పూనమ్ కౌర్ లాంటి వారి మీద కామెంట్లు చేస్తున్నావు కదా.. మీకు జన్మనిచ్చిన తల్లి గురించి వివారాలు చెప్పు అని వివేక్ మరో ప్రశ్న సంధించాడు. అయితే అందుకు కత్తి నిరాకరించాడు. పదే పదే నీ తల్లి గురించి చెప్పమని అడుగగా బుల్‌షిట్ అంటూ చర్చ మధ్యలో నుంచి లేచిపోయాడు.
అయితే కత్తి మహేష్ తండ్రి నిజంగానే అవినీతికి పాల్పడ్డాడా.. వాయల్పాడు గ్రామానికి నీ కుటుంబం ఎందుకు రాదు.. చిట్టీల పేరుతో ఈ అమ్మ రైతులను మోసం చేసిందా అనే ప్రశ్నలకు సమాధానం చెబుతాడా? వేచి చూడాలి.