Bengaluru: Watch Fire Breaks Out at Kailash Bar And Restaurant.
Five employees of a bar and restaurant were charred to lost life when a major fire broke out at Kumbaara Sangha building in Kalasipalya here in the wee hours on Monday, police said here.
బెంగళూరు: నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్కే మార్కెంట్‌లోని కైలాశ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కుంబారా సంఘా భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న ఈ బార్‌లో సోమవారం తెల్లవారుజామున 2.30గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పేశారు.
బార్‌లోనే నిద్రిస్తున్న ఐదుగురు సిబ్బంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మృతుల్లో స్వామి(23) తమకూరు, ప్రసాద్(20)తమకూరు, మంజునాథ్(45)హసన్, కీర్తి(24) మాండ్య, మహేష్(35)తమకూరు) ఉన్నారు.