India vs South Africa 1st Test : Team India Ready for the Challenge

Oneindia Telugu 2018-01-05

Views 116

India vs South Africa : As an opening batsman, Vijay feels swing will be more important to counter than bounce. "Swing I think, because bounce, personally I think I am able to manage bounce more. The ball swings around so it is difficult for any batsman to keep the shape," he said.

కోహ్లీసేన కోసం దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లను తయారు చేస్తోందనడానికి మరో నిదర్శనం ఉంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు శుక్రవారం (జనవరి 5)న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన వీక్‌నెస్‌పై కొట్టాలని దక్షిణాఫ్రికా చూస్తోంది.ఇందులో భాగంగా తొలి టెస్ట్ జరిగే కేప్‌టౌన్‌కు సెంచూరియన్ పిచ్ క్యూరేటర్‌ చేత పిచ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. స్థానిక పిచ్ క్యూరేటర్ ఇవాన్ ఫ్లింట్‌కు పేస్ పిచ్ తయారీలో సహకరించాల్సిందిగా సెంచూరియన్ క్యూరేటర్ బ్రయిన్ బ్లాయ్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశించింది. సెంచూరియన్ పిచ్ దక్షిణాఫ్రికాలోనే పేస్ పిచ్‌గా నిలిచింది.

ఇక్కడ జరిగిన చివరి మూడు టెస్టుల్లో మొత్తం 93 వికెట్లు నేలకూలగా.. అందులో పేస్ బౌలర్లే 83 వికెట్లు తీసుకున్నారంటే సెంచూరియన్ పిచ్‌ని అర్ధం చేసుకోండి. ఇక, తొలి టెస్టు జరిగే కేప్‌టౌన్‌లో జరిగిన చివరి మూడు టెస్టుల్లో 81 వికెట్లకుగాను 59 వికెట్లను మాత్రమే పేస్ బౌలర్లు పడగొట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS