మీ కష్టం నాకు తెలుసు.. పవన్ ఎమోషనల్ మెసేజ్ !

Filmibeat Telugu 2018-01-04

Views 917

Power Star Pawan Kalyan given a message to overseas audience. Pawan felt happy over Agnyaathavaasi releasing in somany theatres there.

ఒకప్పుడు ఓవర్ సీస్ మార్కెట్ బాలీవుడ్‌కే పరిమితం. కానీ ఇప్పుడా గోడలు బద్దలయ్యాయి. తెలుగు సినిమా కూడా విదేశాల్లో కోట్లు వసూళ్లు చేసే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలైతే ఓవర్ సీస్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి.
తాజాగా విడుదలకు సిద్దమవుతోన్న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'పై కూడా రికార్డులు కూడా బ్రేక్ చేసే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓవర్ సీస్ లోని తన అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఓ సందేశమిచ్చారు..
విదేశాల్లో ఉన్న తెలుగువారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉన్న ఊరిని వదిలి పక్క ఊరికి వెళ్లి పనిచేయడమే చాలా కష్టం. అలాంటిది రాష్ట్రాలు వదిలి దేశం కాని దేశం వదిలి చదువు కోసం.. ఉద్యోగం కోసం మీరు పడుతున్న కష్టాలేంటివో నాకు తెలుసు.
ఆత్మగౌరవం కోసం అక్కడ స్థానికత కోసం మీరు పడే ఇబ్బందులు తెలుసు. అందుకే అక్కడ మీకేం జరిగినా.. మీకు అండగా నిలబడటానికి ఇక్కడ కోట్ల మంది ఉన్నారు. నా చిత్రాలను ఆదరిస్తున్న మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS