స్కైబాబా పై బెజవాడ దాడి : నిరసన సెగ, విజయవాడలో ఉద్రిక్తత

Oneindia Telugu 2018-01-04

Views 13

The protest against Telangana writer Skybaba became hot topic in social media, Netizens are saying this was not right to took place.

విజయవాడ పుస్తక మహోత్సవంలో తెలంగాణ రచయిత స్కైబాబపై జరిగిన దాడికి సంబంధించి సోషల్ మీడియాలో వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. స్కైబాబ తెలంగాణ ఉద్యమ కాలంలో రాసిన ఓ కవితలో వాడిన పదాలను ఆంధ్ర రచయితలు కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు స్కైబాబపై దాడి జరగలేదని, నిరసన వ్యక్తం చేశారని చెప్పేవారు కూడా ఉన్నారు. ఆయన ఎప్పుడో రాసిన ఓ కవితను వివాదంగా మార్చడాన్ని కూడా వ్యతిరేకించేవారున్నారు. కవితలో వాడిన భాషనే తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైనట్లు కనిపిస్తోంది.
విజయవాడలోని పుస్తకమహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రచయిత స్కైబాబకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. విజయవాడ పుస్తక మహోత్సవంలో కొంత మంది ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో స్కైబాబా రాసిన రాతలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.మా తెలుగు తల్లి పాట పాడిన తర్వాతే పుస్తకావిష్కరణ జరగాలని ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో స్కైబాబా రాసిన రచనలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, దీనికి ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాతే పుస్తకావిష్కరణ చేసుకోవాలని భాషాబిమానులు స్పష్టం చేశారు.ఆరే ఆంధ్రుడా నంగినంగి వేషాలు వద్దు, నక్కతలుపులు ఇకపై చూపెట్టొద్దు, బెజవాడకు మెయిలు కడతాం, బద్మాష్‌లంతా బదాయించాలి'' వంటి స్కైబాబ రాసిన కొన్ని రచనలను వారు చదివి వినిపించారు. తమకంటూ ఆత్మగౌరవం ఉందని, స్కైబాబా సభా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS