Here are the 10 Health Benefits Of Black Pepper For Weight Loss. Black pepper is rich in minerals like magnesium, copper, manganese, calcium, phosphorous, iron, etc. Apart from the benefits that it offers, black pepper has potential benefit of fighting obesity and can be used as a source of flavour in a weight-loss diet.
మసాలా వంటకాలలో చిటికెడు మిరియాల పొడి వేస్తే రుచి మరింత పెరుగుతుంది, కాదంటారా? లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిన ఈ మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రాజు లాంటిది. మిరియాలలో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా ఉన్నాయి. మిరియాలలో పీచు పదార్ధం, తక్కువ మోతాదు ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నాయి. మిరియాలు అతిసారం, మలబద్ధకాన్ని నిరోధించి, జీర్ణక్రియకు దోహాద పడుతుంది. మిరియాలు ప్రేగుల్లో వాయువు ఏర్పడకుండా నిరోధించి, చెమటను పెంపొందించి, మూత్రవిసర్జనను ప్రోత్సహిస్తుంది.
మిరియాలలో యాంటీ-బాక్టీరియా, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వల్ల ఇవి అంటువ్యాధులు రాకుండా ఉండడానికి సహాయపడి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని సరిచేస్తుంది.ఆయుర్వేదం ప్రకారం, మిరియాలు చెవి నొప్పి, పుళ్ళను కూడా నివారించడానికి సహాయపడుతుంది. ఈ ప్రయోజనాలను అందించడమే కాకుండా, మిరియాలు స్దూలకయంపై పోరాడడానికి ఉపయోగపడుతుంది, బరువు తగ్గించే ఆహార పదార్ధాలలో సువాసన ఏజెంట్ గా ఉపయోగించుకోవచ్చు. బరువు తగ్గడానికి మిరియాలలో ఉన్న 10 ఆహార ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
మిరియాలు పైపెరిన్ అనే శక్తివంతమైన మిశ్రమం ఉంది, ఇది మిరియాలకు మంచి రుచిని ఇస్తుంది. ఈ మిశ్రమం నూతన కొవ్వు కణాలు ఏర్పడడంలో కలుగచేసుకుని, అడిపోజేనేసిస్ అనే ప్రతిచర్య మీ నడుముని తగ్గించి, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.ఆహార సరైన సమీకరణలో మిరియాలు చికిత్సగా పనిచేస్తాయి. అంతేకాకుండా, మిరియాల బయటి పొర కొవ్వు కణాల విచ్చిన్నతను ప్రేరేపించే శక్తివంతమైన ఫైటో న్యూట్రిఎంట్లను కలిగి ఉంటుంది.