దుర్గ గుడిలో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో !

Oneindia Telugu 2018-01-03

Views 4

Speculation is rife that Bhairavi Puja, a tantrik ritual, was performed at the Kanaka Durga temple here. EO Surya Kumari condemned rumors.

సంచలనం రేపిన విజయవాడ కనకదుర్గ గుడి తాంత్రిక పూజల ఘటనలో ఆలయ ఈవో సూర్య కుమారి బుధవారం స్పందించారు. ప్రభుత్వం తనపై వేటు వేసిన విషయం, ఆలయంలో తాంత్రిక పూజలు, తనను కొందరు టార్గెట్ చేస్తున్నారనే అంశాలపై ఆమె స్పందించారు.

తనను కొందరు టార్గెట్ చేస్తున్నారని తాను భావించడం లేదన్నారు. ఒకవేళ అలా చేస్తే ఎందుకు చేస్తున్నారో తెలియదన్నారు. తనపై వేటు వేసి, కొత్త ఈవోగా రామచంద్రన్‌ను నియమించిన విషయం తనకు సమాచారం లేదని ఆమె చెప్పారు. ఆలయంలో సంప్రదాయానికి విరుద్ధంగా ఏమీ జరగలేదన్నారు. ఎలాంటి విషయమైనా ఆధారాలు లేకుండా మాట్లాడనని చెప్పారు.

గుడిలో బద్రీనాథ్ ప్రధాన అర్చకులు, మరో ఇద్దరు సహాయకులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తనకు సమాచారం లేదని చెప్పారు. తాము వారిని పూజల కోసం పిలిచినట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. గుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని చెప్పారు. పాలకమండలి సభ్యులతో అంతరం ఉన్న మాట నిజమే అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS