Hundreds of Dalits came on Mumbai streets on Wednesday to protest against the violence that took place in Pune and halt a train at Thane Railway Station.
కోరేగావ్ - భీమా సంఘటనకు నిరసనగా దళిత నేతలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం మహారాష్ట్ర బంద్ కొనసాగుతోంది. భరిప బహుజన్ మహాసంఘ్ నేత, బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ బంద్‌కు పిలుపునిచ్చారు. హింసాత్మక సంఘటనలను నిలువరిండంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా బంద్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పూణేలో సోమవారం జరిగిన హింసాత్మక సంఘటనలకు నిరసనగా ముంబైలో నిరసనలు పెల్లుబుకాయి. ఆందోళనకరాలు బస్సులను ధ్వంసం చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.
మితవాద హిందూ సంస్థలకు, దళిత గ్రూపులకు మధ్య సోమవారం భీమా - కోరేగావ్ 200 వార్షికోత్సవం సందర్భంగా పూణేలో ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో ఓ వ్యక్తి మరణించాడు. హిందూ ఏక్తా అఘాదీ, శివరాజ్ ప్రతిష్టాన్ నేతలు మిలింద్ ఎక్బోటే, శంబాజీ భీడేలపై పింప్రి పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ రెండు సంఘాలు కూడా దళితుల బీమా కోరేగావ్ విజయ్ దివస్‌ను వ్యతిరేకించాయి.