Vijayawada : Chief Minister N Chandrababu Naidu inaugurated multimedia laser show on water screens integrated with musical dancing fountain at Bhavani Island in river Krishna.
సోమవారం రాత్రి భవానీద్వీపంలో పర్యాటక అభివృద్ధి సంస్ధ నేతృత్వంలో దేశంలోనే వినూత్నమైన మొట్టమొదటి మల్టీమీడియా లేజర్ షో-డాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్‌ను చంద్ర బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మంచి పర్యాటక హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లేజర్ షోలను గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో చాలా మంది చూసే ఉంటారు. అయితే ఇప్పుడు మల్టీమీడియా లేజర్ షోను భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్(బీఐటీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
కాగా ఈ లేజర్‌షో నీటిపై ఉంటుంది. ఫౌంటేన్ల నుంచి నీరు ఎగసిపడుతూ ఉంటుంది. తెరపై వివిధ రకాల రంగుల్లో లేజర్ కిరణాలను వదులుతారు. సన్నివేశానికి తగ్గట్లుగా సంగీతం కూడా ఉంటుంది. చీకటి పడిన వెంటనే దీనిని ప్రారంభిస్తారు. ఒక వేదిక మీద సంగీత కచేరీ జరుగుతుంటే దానికి అనుగుణంగా చుట్టూ ఉన్న పౌంటెయిన్స్ నృత్యాలు చేస్తుంటాయి. అటు మల్టీమీడియా లేజర్ షోను, ఇటు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పౌంటెయిన్ను అనుసంధానం చేసారు. ఇక ఈ విధమైన లేజర్‌షోలు దేశంలోనే అరుదుగా ఉన్నాయి.విదేశాల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న మల్టీమీడియా లేజర్ షో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
కనుక ఇటువంటి వినూత్న విదానాల వల్ల ఆంధ్రప్రదేశ్ టూరిజం మరింత అబివృద్ది చెందుతుందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.