In a horrific incident, seven member of a family, including three children, were found lost life in a house in Telangana’ Yadadri district.
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు అనుమానాస్పదరీతిలో మరణించారు.కోళ్లఫారం వద్ద నివాసగృహంలో వారు మరణించారు. మృతిచెందినవారు వృద్ధులు బైండ్ల బాలనర్సయ్య, భారతమ్మ, దంపతులు బాలరాజు, తిరుమల సహా ఇద్దరు కుమారులు, కూతురు.
మృతులంతా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడపవాసులుగా తెలుస్తోంది. రాత్రి తిన్న చికెన్ ఫుడ్ పాయిజన్ అయి వీరు మృతిచెంది ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కూడా ఆత్మహత్యగా అనిపిచడం లేదని అంటున్నారు.
ఇటీవల కొన్ని కుటుంబాలు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడడం తెలుగు రాష్ట్రాల్లో పలువురిని విస్మయానికి గురి చేస్తున్నాయి.