A special song featuring Pawan Kalyan’s voice will be recorded soon and released as a New Year gift for the actor’s fans.
పవన్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు ఎంతటి పండుగనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో పాటలకు పిచ్చి అభిమానం తో ఫ్యాన్స్ ఊగిపోతారు.. ఇక స్వయంగా ఆయనే పాడితే ఇంకెంత రచ్చ చేస్తారో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అజ్ఞాతవాసితో ఇప్పుడు ఆ రచ్చ మరోసారి రిపీట్ కాబోతోంది. పవన్ స్వయంగా మరోసారి తన గాత్రం సవరించడంతో.. అభిమానులు పండుగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
తమ్ముడు... జానీ.. అత్తారింటికి దారేది.. కాటమరాయుడు.. ఇలా అడపాదడపా పాటలు కూడా పాడుతూ వస్తున్న పవన్.. అజ్ఞాతవాసిలోను పాట పాడారన్న సంగతి కాస్త ఆలస్యంగానే రివీల్ చేసింది చిత్ర యూనిట్.
తెరపై ఆయన పాట ఎప్పుడెప్పుడు చూద్దామా?.. ఎప్పుడు స్టెప్పులేద్దామా? అన్న ఉత్సాహంలో ఉన్నారు.
కాటమరాయుడులో పవన్ పాడిన పాటకు దాని పిక్చరైజేషన్ కూడా ప్లస్ అయింది.