పార్టీ శ్రేణుల సంబరాలు : కాంగ్రెస్ కూడా తక్కువేమీ కాదు !

Oneindia Telugu 2017-12-18

Views 476

The Bharatiya Janata Party workers all across the country are celebrating with pomp and show as trends are indicating a definite win for the party in both Himachal Pradesh and Gujarat. The BJP workers in Bhopal celebrated at the party office by exchanging various Gujarati Delicacies.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి రెండు రాష్ట్రాల్లోనూ స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఢిల్లీ బీజేపీ కార్యాలయంతోపాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కార్యాలయాల్లో బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ శ్రేణులు కూడా ఈ సంబరాలను కొనసాగిస్తున్నాయి.ఇక కాంగ్రెస్ పార్టీకి ఒకింత నిరాశ తప్పడం లేదు. గుజరాత్ లో ఆశించిన ఫలితాలు రాకపోవడం, హిమాచల్ ప్రదేశ్ చేజారడం కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో అధికారం కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. అయితే ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ అన్ని సర్వశక్తులను ధారపోసింది.గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలికే పరిస్థితి నుండి బిజెపి వైపుకు మళ్ళారు. అయితే పలు దఫాలు గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసిన ఘటనలు కూడ చోటు చేసుకొన్నాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలు కూడ లేకపోలేదు.అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బిజెపి రాష్ట్రంలో పుంజుకొంది. బిజెపి ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కాంగ్రెస్‌కు సాధ్యం కావడం లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS