Virat Kohli and Anushka Sharma will be hosting wedding receptions in Delhi and Mumbai on 21st and 26th December respectively. The couple then fly out to South Africa together.
ఇటలీలో రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లి దంపతులు త్వరలో ఇండియా రాబోతున్నారు. ఇండియా వచ్చిన తర్వాత ఢిల్లీ, ముంబైలలో వేర్వేరుగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించి ప్రముఖులకు గ్రాండ్‌గా విందు ఇవ్వబోతున్నారు.
ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న అనుష్క-విరాట్ జంట.... వివాహం పూర్తయిన తర్వాత సోషల్ మీడియాలో తమ పెళ్లి విషయాన్ని ధృవీకరిస్తూ ఫోటోలు పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఒకరు టీమిండియా కెప్టెన్ కావడం, మరొకరు బాలీవుడ్ స్టార్ కావడంతో వీరి పెళ్లి విషయం రెండ్రోజులుగా దేశ వ్యాప్తంగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
వెడ్డింగ్ రిసెప్షన్ అనంతరం విరాట్-అనుష్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సౌతాఫ్రికాలో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలో విరాట్ క్రికెట్ టూర్ నిమిత్తం సౌతాఫ్రికా వెళుతున్నారు. పెళ్లయిన తర్వాత విరాట్ వెళుతున్న ఫస్ట్ టూర్ ఇదే. రెండు నెలల పాటు ఈ టూర్ సాగనుంది. విరాట్‌తో పాటు అనుష్క కూడా సౌతాఫ్రికా వెళ్లబోతోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఇద్దరూ ఇక్కడే జరుపుకోనున్నారు.
సౌతాఫ్రికాలో తన భర్త విరాట్‌తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత అనుష్క తిరిగి ఇండియా వచ్చి తన సినిమా ప్రొఫెషన్లో బిజీ కానుంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె షారుక్ ఖాన్‌తో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్ ధావన్ సినిమా చేయనుంది. ఫిబ్రవరిలో తన తాజా చిత్రం ‘పారి' చిత్ర ప్రమోషన్స్‌లో అనుష్క బిజీ కాబోతోంది.