Watch MCA - Middle Class Abbayi Theatrical Trailer starring Nani, Sai Pallavi Produced by Dil Raju, Shirish, Laxman & Directed by Sriram Venu.
నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజా గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. మిడికల్ క్లాస్ ఫ్యామిలీ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. వదిన, మరిది అనుబంధాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో వదిన పాత్రలో బూమిక, మరిది పాత్రలో నాని నటిస్తున్నాడు.
అయితే మిడిల్ క్లాస్ రిలేషన్స్‌పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ వదిన, మరిది మధ్య అనుబంధంపై సినిమాలు వచ్చి చాలాకాలమైంది. ఇందులో మధ్య తరగతి కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్, డ్రామా అంతా కనపడుతుంది. వీటితో పాటు బ్యూటిఫుల్ లవ్‌స్టోరి ఉంటుంది. సాయిపల్లవి ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.
అయితే ఈ సినిమాలో సాయి పల్లవి నటిచడం పెద్ద ప్లస్ పాయింట్. నాని, సాయిపల్లవిల మధ్య ఉండే సీన్స్ చూసి ఆడియెన్స్ ఎగ్జయిట్ అవుతారు. సినిమాలో విజయ్ వర్మ విలన్‌గా కనిపిస్తాడు. అన్ని కోణాలు ఈ సినిమాలో ఉంటాయని దిల్ రాజు తెలిపారు.