‘అజ్ఞాతవాసి’ టీజర్ డేట్ ఫిక్స్ ! ఎప్పుడో తెలుసా ? | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-12-12

Views 2.3K

Agnyaathavaasi teaser to be out on December 16th. Agnyaathavaasi is an upcoming 2018 Telugu action drama film directed by Trivikram Srinivas and starring Pawan Kalyan, with Keerthy Suresh, Aadhi Pinisetty, Anu Emmanuel, and Boman Irani in supporting roles.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అజ్ఞాతవాసి'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబతోంది.
సినిమాకు సంబంధించిన న్యూ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈ నెల 16న చిత్ర యూనిట్ నుండి సర్‌ప్రైజ్ రాబోతోంది.
అజ్ఞాతవాసి' సినిమా టీజర్ డిసెంబర్ 16వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఖరారు చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
అజ్ఞాతవాసి' సినిమాకు ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటివి ఏమీ నిర్వహించడం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో నేరుగా ఆడియో మార్కెట్లోకి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ నటిస్తున్నారు. వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS