భారత్‌తో అఫ్ఘనిస్థాన్‌ టెస్ట్ మ్యాచ్, 2023 ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం

Oneindia Telugu 2017-12-11

Views 325

BCCI on Monday met in New Delhi for its Special General Body meeting to decide on a slew of important on field and off field matters.India will play Afghanistan in a Test in the 2019-2020 season.

న్యూ ఢిల్లీలో సోమవారం బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సమావేశమైంది. ఇందులో కొన్ని కొత్త సూచనలను తీసుకొచ్చింది. 2023 ప్రపంచ కప్ వన్డే సిరీస్ ను ఉద్దేశించి జరిగిన సమావేశంలో జరిపిన ముఖ్యాంశాలు ఏమిటంటే
1. 2019-2020 సీజన్‌కి గాను అఫ్ఘనిస్థాన్ జట్టుతో భారత్ టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. కాగా అఫ్ఘనిస్థాన్ జట్టు కు ఇదే తోలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. అది కూడా భారత్ తో జరగడం మరొక విశేషం. ఇక
ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కి భారత్ నే ఆతిథ్యం ఇవ్వనుంది కూడా. అంతేకాదు
2. 2023 ప్రపంచ కప్ 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంతకుముందు 2011 ప్రపంచ కప్ మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ధోని సారథ్యంలో జరిగిన ఈ సిరీస్‌లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. 2015 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో మధ్య జరగగా ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే. ఇక 2019 ప్రపంచ కప్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చే 2023 ప్రపంచ కప్ కు మళ్ళి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS