Major road Mishap happened in Karnool dist. watch video
కర్నూలు: కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో బైక్ మీద వెళుతున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక ఆళ్ళగడ్డ తాలూకా శిరవేళ్ళ మండలం శిరవేళ్ళ మెట్ట మీద NH40 హైవే పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో బైక్ పై వెళుతున్న ఇద్దరు మహిళలు ఒక బాబు బైక్ నడుపుతున్న వ్యక్తి మొత్తం నలుగురు మరణించారు. హైవే లో వెళుతున్న ఈ బైకు ని ఒక కారు వెనుకనుండి చాలా వేగంగా వచ్చి డీ కొట్టింది.
బైక్ పై వెళ్తున్న నలుగురిని వెనకనుండి కార్ డీ కొట్టడం తో నలుగురు రోడ్డుకు దూరం గా పడిపోయారు, బండి తుక్కు తుక్కు అవ్వగా నలుగురు ప్రమాద ఘటనా స్థలం లోనే తీవ్ర గాయాలతో మృతి చెందారు. కారు లో ఉన్న వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యాయి. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.మృతులు నలుగురు ఆళ్ళగడ్డ వాసులుగా పోలీసులు గుర్తించారు.