NMDC diamond jubilee fete : Venkaiah Naidu praises Hyderabad

Oneindia Telugu 2017-12-09

Views 320

Vice president Venakaih Naidu said that Hyderabad is the most happening and charming city of the country. He compared the capital city to 18-year-old girl.

హైదరాబాదు నగరాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు 18 ఏళ్ల యువతిగా అభివర్ణించారు. ప్రపంచం కళ్లన్నీ హైదరాబాదు మీదే ఉన్నాయని, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోందని, దాన్ని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఐటి శాఖ మంత్రి కెటి రామారావుపై ఉంది ఆయన అన్నారు. హైదరాబాద్ దేశంలోనే చార్మింగ్, హ్యాపెనింగ్ సిటీ అని ఆయన అన్నారు.హైదరాబాద్ బిర్యానీ గురించి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిందని చెప్పారు. శుక్రవారం మాదాపూర్ శిల్పాకళావేదికలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు ఉక్కు కర్మాగారాలు రావాల్సి ఉందని, ఒకటి బయ్యారంలో మరోటి కడపలో ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. దీనిపై ఉక్కు శాఖ త్వరలో నివేదిక ఇస్తుందని తెలిపారు. ఆ తర్వాత ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Share This Video


Download

  
Report form