నితిన్, రానా, నారా రోహిత్ మల్టీస్టారర్.. ! | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-12-09

Views 753

PSV Garuda Vega became a stupendous success and the biggest hit in the career of actor Rajasekhar and director Praveen Sattaru. And according to latest reports, Praveen Sattaru is onto something bigger than his previous release and is planning a multi-starrer.


జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు ప్రవీణ్ సత్తారు వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం పీఎస్వీ గరుడ వేగతో ఘనవిజయాన్ని అందుకొన్న ప్రవీణ్ మరో భారీ బడ్జెట్ చిత్రానికి కసరత్తు చేస్తున్నారు. ఈ చిత్రం మల్టీస్టారర్ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో ఇద్దరు కాదు.. ముగ్గురు తెలుగు క్రేజీ హీరోలు నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
గరుడ వేగ తర్వాత తాను హీరో నితిన్‌తో సినిమా చేస్తున్నట్టు ప్రవీణ్ సత్తారు వెల్లడించారు. అలాగే ప్రవీణ్ సత్తారుతో తాను సినిమా చేస్తున్నట్టు నితిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రవీణ్ సత్తారు. నితిన్ సినిమా కన్ఫర్మ్ అని మీడియాలో కథనం రాగానే ఆ చిత్రం మల్టీ‌స్టారర్ చిత్రమనే విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే సినిమాలో నితిన్‌తో పాటు రానా ఓ మఖ్యమైన పాత్రలో నటించనున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో మూడో హీరో కూడా ఉంటారట. ఆ పాత్ర కోసం నారా రోహిత్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని. ఇంకా చర్చల దశలోనే ఉన్నందున హీరోలు ఖరారు కాలేదు అని చిత్ర యూనిట్ పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు వివరాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
ఒకవేళ రానా దగ్గుబాటి ఈ చిత్రంలో నటిస్తే టాలీవుడ్‌లో సెన్సేషనల్ మల్టీస్టారర్‌గా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రానా ఇప్పుడు దేశంలోనే గొప్ప స్టార్లలో ఒకరు. ఆయన చేస్తున్న చిత్రాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS