Janasena Party president Pawan Kalyan on Wednesday fired at Parakala Prabhakar for allegations on PRP.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తన విశాఖపట్నం పర్యటనలో కేంద్రం ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. తన ప్రసంగంలో వివిధ అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వాల వైఖరితో సామాన్యులు, నిజాయితీపరులే కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ, రాష్ట్ర విభజన, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురించి, దివంగత సీఎం వైయస్ గురించి కూడా పవన్ తన ప్రసంగంలో ప్రస్తావించడం గమనార్హం. ప్రజా సమస్యలపై గళమెత్తుతానన్న వపన్.. మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర, ఒంగోలు పర్యటనకు వచ్చారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘రాజకీయ వ్యవస్థలో జరుగుతోన్న తప్పులు నాకు తెలుసు. పోలవరంలో అవినీతి జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు. తెలంగాణలో అప్పట్లో నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని పంపించేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల కాంట్రాక్టులను మళ్లీ ఆంధ్రావాళ్లకే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది' అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.