After success of Saptagiri Express, Hero Saptagiri coming with his latest movie is Saptagiri LLB. This movie is remake for Hindi movie Jolly LLB.
టాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత కమెడియన్గా మారి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. దాదాపు 70కు పైగా చిత్రాల్లో నటించిన తర్వాత సప్తగిరి ఎక్స్ప్రెస్తో హీరోగా మారాడు. ఆ చిత్రం అందించిన విజయ స్ఫూర్తితో మళ్లీ హీరోగా సప్తగిరి ఎల్ఎల్బీ చిత్రంతో ముందుకొస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 7న రిలీజ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో సప్తగిరి మీడియాతో మాట్లాడారు. సప్తగిరి వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..
సప్తగిరి ఎక్స్ప్రెస్ చిత్రం నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నా నిర్మాతను సేఫ్ జోన్లోకి తీసుకెళ్లింది. మళ్లీ అదే కాంబినేషన్లో మంచి సినిమా చేయాలని చేసిన ప్రయత్నమే సప్తగిరి ఎల్ఎల్బీ చిత్రం. హిందీలో నటుడు అర్షద్ వార్షి చేసిన పాత్రను నేను చేస్తున్నాను. ఈ సినిమా భావోద్వేగంతోపాటు ప్రేక్షకుడు ఉత్కంఠకు లోనవ్వడం ఖాయం.
సప్తగిరి ఎక్స్ప్రెస్ అందించిన విజయం స్ఫూర్తితో సగటు జీవి, ఓ నిజాయితీపరుడైన లాయర్ కథా నేపథ్యంగా సప్తగిరి ఎల్ఎల్బీ తీశాం. ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించిన జాలీ ఎల్ఎల్బీ చిత్రానికి రీమేక్.