Engineering Colleges Campus Placements down

Oneindia Telugu 2017-12-06

Views 1

This year Engineering colleges campus recruimetns are shrink comparitively with last year. Students and their parents are facing tension.

ఎప్పుడైతే పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చాయో.. క్రమంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గిపోవడం మొదలైంది. సరైన ఫ్యాకల్టీ ఉండరు, సరైన ల్యాబ్స్, వసతులు ఉండవు. అయినా సరే, ఇంజనీరింగ్ చదవాలన్న యువత క్రేజ్.. ఎందుకు పనికిరాని కాలేజీలకు కూడా వరం లాగా మారింది. అదే సమయంలో కొద్దో గొప్పో మంచి స్టాండర్డ్స్ ఉన్న కాలేజీలుగా పేరు తెచ్చుకున్నవాటిల్లో ప్రవేశాలకు డిమాండ్ పెరిగింది. బయట ఏ కాలేజీలో చదివినా.. అటు సరైన చదువు రాక, చదువయ్యాక ఉద్యోగం రాక తిప్పలు పడాల్సి వస్తుండటంతో.. లక్షల డొనేషన్లు కట్టి మరీ ఈ టాప్ కాలేజీల్లో చేరడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.
టాప్ కాలేజీల్లో చేరినా సరే.. క్యాంపస్ రిక్రూట్ మెంట్లు ఆశించినంతగా లేకపోతుండటం ఇప్పుడు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోన్న అంశం. లక్షలు పోసి చదువుకున్నా.. ఉద్యోగాలు రాకపోతుండటంపై వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గతేడాది ఆయా కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్ మెంట్ల ద్వారా సుమారు 500-600మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాగా.. ఈ ఏడాది ఆసంఖ్య 150కి పడిపోవడం గమనార్హం. దీంతో టాప్ కాలేజీల్లో చదివినా.. ఉద్యోగానికి గ్యారెంటీ లేదనట్లుగా తయారైంది పరిస్థితి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS