On December 6, 1992, Babri Masjid in Ayodhya, was reduced to rubble and then preceded by a Rath Yatra, triggering the culmination of the historic schism.
బాబ్రీ మసీదు కూల్చివేతకు నేటితో 25ఏళ్లు. మతాలతో ముడిపడి ఉన్న ఈ వివాదంపై నేటికి ఎన్నో వాదనలు. మసీదును కూల్చివేసి రామ మందిరం నిర్మించాలన్న ఉద్దేశంతో అప్పటి బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు ఈ కూల్చివేతకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. నేటితో బాబ్రీ విధ్వంసానికి 25 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో.. ముస్లిం మత సంస్థలు, ఎంబీటీ, ఏఐఎంఐఎం పార్టీలు బుధవారం 'బ్లాక్ డే' ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పాతబస్తీలో 3500మంది పోలీసులతో ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.