Pawan Kalyan Uttarandhra Tour Updates | Oneindia Telugu

Oneindia Telugu 2017-12-06

Views 5.7K

Jana Sena chief and Power Star Pawan Kalyan Uttarandhra Tour Updates on Wednesday. He is touring Uttarandhra for 3 days from Wednesday.

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆయన ఉదయం తొమ్మిది గంటల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
పవన్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు. 9వ తేదీన ఒంగోలులో కృష్ణా నది పడవ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం విశాఖ చేరుకున్న పవన్ తొలుత ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత డీసీఐ ఉద్యోగులతో భేటీ అవుతారు. ఉద్యోగులు డీసీఐ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. మధ్యాహ్నం జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS