Nikesha Patel of 'Komaram Puli' fame has called out the culture of casting couch in Telugu film industry. In a interview, she has said that Tollywood has the problem as much as it's there in Hollywood.
హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ సంఘటన తర్వాత సినిమా పరిశ్రమల్లో లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ అంశంపై తరచూ ఏదో ఒక చర్చ జరుగుతోంది. హీరోయిన్లు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నపుడు కాస్టింగ్ కౌచ్ గురించి తప్పకుండా ఓ ప్రశ్న ఎదురవ్వడం, దానికి వారు తమకు ఎదురైన సంఘటనల గురించి చెప్పడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ 'కొమురం పులి' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నికీషా పటేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు.
హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ సంఘటన జరిగినపుడు మా నాన్న నాకు ఫోన్ చేసి టాలీవుడ్లో పరిస్థితి ఏమిటని ఆరా తీశారని, అపుడు ఆయనకు ఇక్కడ అలాంటిదేమీ లేదనే సమాధానం చెప్పలేక పోయానని, టాలీవుడ్లోనూ అలాంటి పరిస్థితులు ఉన్నాయని నికీషా పటేల్ తెలిపారు.
సెక్సువల్ వేధింపుల విషయంలో హాలీవుడ్ పరిశ్రమకు, టాలీవుడ్ పరిశ్రమకు పెద్దగా తేడా ఏమీ లేదని నికీషా పటేల్ తెలిపారు. అవకాశాల కోసం ఆ విషయంలో కాంప్రమైజ్ కావాలని కోరేవారు చాలా మంది ఇక్కడ ఉన్నారని నికీషా పటేల్ తెలిపారు. అలాంటి అన్ ప్రొఫెషనల్ పీపుల్‌లో ఆడవారు కూడా ఉన్నారని నికీషా వెల్లడించారు.
అయితే ఇంస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్లకు అలాంటి వేధింపులు చాలా తక్కువ. బాగా పాపులారిటీ ఉన్నవారు అసలు అలాంటివి ఎదుర్కొని ఉండక పోవచ్చు. అయితే అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యే వారికి మాత్రం ‘కాస్టింగ్ కౌచ్' లాంటి సంఘటనలు తరచూ ఎదురవుతాయని నికీషా పటేల్ తెలిపారు.