Comedian Naveen tried to hide under the car while police tying caught him in drunken drive case in Hyderabad of Telangana.
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీల్లో నలుగురు యువతులు సైతం చిక్కారు. క్యాన్సర్ హాస్పిటల్ వద్ద చిక్కిన ఇద్దరికి బీఏసీ కౌంట్లు 83, 95 వచ్చాయి. మరో వైపు జూబ్లీహిల్స్ రోడ్ నం.45 సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 9 కార్లు, 5 ద్విచక్ర వాహనచోదకుల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరిలోనూ ఇద్దరు యువతులు ఉన్నారు. వీరి బీఏసీ కౌంట్ 80 కంటే ఎక్కువ వచ్చింది.
కార్లలో వచ్చిన ఈ నలుగురు యువతులూ తొలుత తమను పరీక్షించవద్దని పట్టుబట్టారు. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా పరీక్షించడానికి ప్రయత్నించారు. దాంతో తిట్ల దండకం ప్రారంభించారు. చివరకు టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో నోరు మూసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.పోలీసులకు చిక్కిన యువ హాస్య నటుడు నవీన్ తప్పించుకునేందుకు శత విధాల ప్రయత్నించారు. కారు డ్రైవ్ చేస్తూ వస్తున్న నవీన్‌ను ఆపి తనిఖీ వారు తనిఖీ చేశారు. ఆయన మద్యం తాగినట్లు తేలింది.