On the eve of the World Disability Day on December 3, a walk was conducted involving the disabled people at Necklace road here on Saturday.
నేనూ దివ్యాంగుడినే, నాలోనూ శారీరక లోపం ఉంది అంటూ హీరో రాజశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాంగుల దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్‌లో దివ్యాంగులు చేపట్టిన నడక కార్యక్రమంలో రాజశేఖర్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఎవరూ నిరుత్సాహపడకూడదని, ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. తాను కూడా దివ్యాంగుడినే అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
జనాభాలో 10 శాతం దివ్యాంగులు ఉన్నారు. మీకు తెలుసో.. తెలియదో.. నేను కూడా దివ్యాంగుడినే. నాకు చిన్నప్పటి నుంచి నత్తి ఉండేది. మాటలు సరిగా వచ్చేవి కాదు. మా నాన్న గారి పేరు అడిగితే చెప్పలేకపోయేవాడ్ని, అప్పట్లో ఇది ఎక్కువగా ఉండేది, ఇపుడు అది కాస్త తగ్గింది అని రాజశేఖర్ తెలిపారు.
చిన్నతనంలో ఇంటి దగ్గర, పాఠశాలలో అందరితో కలిసి ఆడుకుంటున్న సమయంలో నా నత్తి చూసి అంతా నవ్వేవారు. హేళన చేసేవారు. వారు అలా చేస్తుంటే చాలా బాధపడేవాడ్ని. ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాను కాబట్టే ఇక్కడి వరకు వచ్చానని రాజశేఖర్ తెలిపారు.