Former US President Barack Obama arrived at the Delhi Town Hall to interact with young leaders from across India for Obama Foundation on Friday.
భారతీయ ముస్లింలు మొదట తాము భారతీయులమనే భావిస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. భారత పర్యటనలో ఉన్న ఒబామా శుక్రవారం హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఒబామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోనూ పలు ఆసక్తికర అంశాలపై ప్రసంగించారు. ఆ తర్వాత ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముస్లింల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఒబామా ఫౌండేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రధాని కార్యాలయమో, అధ్యక్షుడి కార్యాలయమో ముఖ్యమైనవి కావని ఒబామా స్పష్టం చేశారు. తనకు నచ్చిన సిద్దాంతానికి మద్దతు తెలిపి దాన్ని ప్రోత్సహించే పౌరుడే ప్రజాస్వామ్యంలో కీలకం అని తెలిపారు. నాయకుల నిర్ణయాలు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు.. అది సరైందో కాదో ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత పౌరుడిపై ఉంటుందన్నారు.