H1B visa : వీసా విధానంలో ఎలాంటి మార్పులు లేవు !

Oneindia Telugu 2017-12-02

Views 1

Amid the H1B visa row in India, the US government on Friday said there has been no change in law regarding the H1B regime and the system continued to be as before.

భారతీయ ఐటీ కంపెనీలతోపాటు అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. హెచ్‌-1బీ వీసాపై కఠినతరమైన నిబంధనలు తీసుకురాబోతున్నారంటూ తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తిన క్రమంలో అమెరికా తాజా ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతమున్న హెచ్‌-1బీ వీసా విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని అమెరికా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ముందస్తు ఉన్న విధానమే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దక్షిణ ఆసియాకు చెందిన డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ థామస్ వాజ్డ ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికాలోని హెచ్‌-1బీ వీసా విధానపు చట్టంలో ఎలాంటి మార్పు లేదు. హెచ్‌-1బీ వీసా విధానాన్ని సమీక్షించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ' అని ఆయన తెలిపారు. బెంగాల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మెంబర్ల ఇంటరాక్టివ్‌ సెషన్‌లో వాజ్డ ఈ విషయాన్ని తెలిపారు. చట్టంలో చాలా మార్పులు తీసుకురావాలని అనుకున్నారు. చాలా కేసుల్లో మార్పులు తీసుకురావాల్సినవసరం కూడా ఉంది. కానీ, హెచ్‌-1బీల్లో మార్పుల కొరకు ఇప్పటివరకు ఎలాంటి చట్టాన్ని తీసుకురాలేదు. గతంలో ఉన్నదే కొనసాగుతోంది' అని వాజ్డ తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS