North Korea Activities : ఉత్తరకొరియాపై భద్రతా మండలి నిర్ణయం ? | Oneindia Telugu

Oneindia Telugu 2017-12-01

Views 335

The retaliation took place just six minutes after North Korea launched their fresh test.South Korea’s missiles all successfully hit their targets about 50 meters out at sea.

ఉత్తరకొరియా రెండు రోజుల క్రితం ఖండాంతర క్షిపణిని ప్రయోగించడంతో దక్షిణ కొరియా కూడ రెచ్చిపోయింది. ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన క్షణాల్లోనే దక్షిణ కొరియా కూడ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియాకు బుద్ది చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ క్షిపణిని ప్రయోగించినట్టు దక్షిణ కొరియా ప్రకటించింది.
అయితే ఉత్తరకొరియాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు దక్షిణ కొరియా కూడ సన్నాహాలు చేస్తోంది. ఉత్తరకొరియాను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని దక్షిణ కొరియా కూడ సంకేతాలు ఇచ్చింది.
ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం చేయడంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్షిపణితో అమెరికాలో ఏ ప్రాంతంలోనైనా ఉత్తరకొరియా దాడి చేసే అవకాశం ఉందని నిపుణులు ప్రకటించారు. ఈ రెండు దేశాలు పోటా పోటీగా క్షిపణి ప్రయోగాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ వ్యవహరం మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరకొరియాను నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపదీంతో మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు కూడ లేకపోలేదని నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS