నిహారిక తమిళ మూవీ టీజర్ ఇదే!

Filmibeat Telugu 2017-11-30

Views 1.6K

Niharika Konidela next movie "Oru Nalla Naal Paathu Solren" teaser released. Oru Nalla Naal Paathu Solren is an upcoming Tamil adventure comedy drama film written and directed by Arumuga Kumar. Vijay Sethupathi and Gautham Karthik appear in the lead roles, while Niharika Konidela and Ramesh Thilak play other pivotal roles.

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా పరిచయం అయిన నిహారిక చేసిన తొలి సినిమా 'ఒక మనసు'. ఈ సినిమాలో నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డప్పటికీ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. 'ఒక మనసు' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నిహారిక ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న 'ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్' అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది.
బుధవారం సాయంత్రం ‘ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్' టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో నిహారిక ఎంతో అదంగా కనిపిచిందని, ఆమె పెర్పార్మెన్స్ చూస్తుంటే ఎంతో ముద్దొస్తోందని అంటున్నారు అభిమానులు.
‘ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్' చిత్రానికి అరుముగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్, నిహారిక కొణిదెల, రమేష్ తిలక్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అడ్వంచర్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
నిహారిక తెలుగులో మరో సినిమా చేస్తోంది. ‘హ్యాపీ వెడ్డింగ్' టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సుమంత్ హీరోగా నటిస్తున్నారు. 2018లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
సొంతగా వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్న నిహారిక గతేడాది ‘ముద్దపప్పు ఆవకాయ' రిలీజ్ చేయగా మంచి హిట్టయింది. ప్రస్తుతం తన తండ్రితో కలిసి నాన్న కూచి అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దీనికి నిర్మాత కూడా నిహారికే కావడం విశేషం.

Share This Video


Download

  
Report form