Nara Brahmani Counter to TV9 | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-29

Views 4

Heritage Executive Director Nara Brahmani has given a super answer to TV9 question on GES-2017

ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలుగానే కాకుండా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నారా బ్రాహ్మణి తనకంటూ ఓ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకున్న నాయకత్వ లక్షణాలతో ఆ రంగంలో దూసుకుపోతున్నారు.
తాజాగా, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)లో ఆమె హెరిటేజ్ ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీవీ9 ప్రతినిధి ఆమెను పలకరించారు. 'హైదరాబాద్‌లో జరుగుతోంది కదా ఈ సదస్సు... మీకు ఏమనిపిస్తోంది' అని బ్రాహ్మణిని అడిగారు. నారా బ్రాహ్మణి నుంచి ఎలాంటి సమాధానం రాబట్టాలని టీవీ9 ఈ ప్రశ్న అడిగిందో గానీ.. ఆమె మాత్రం సరైన జవాబిచ్చారు.
‘ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాష్ట్రంలో ఈ సదస్సు జరగడం అనేది మనకి ఎంతో గర్వకారణం. ఈ సదస్సు ఎక్కడ జరుగుతోంది అనేది ప్రధానం కానేకాదు. అలాగైతే దేశంలోనే మహిళా సాధికారితకు సంబంధించి అతి పెద్ద మహిళా పార్లమెంటు సదస్సు గత సంవత్సరం ఏపీలోనే జరిగింది' అని బ్రాహ్మణి జవాబిచ్చారు

Share This Video


Download

  
Report form