Another YSR Congress Party leader Gurunath Reddy to join Telugu Desam soon. MLA Prabhakar chowdary on Wednesday met AP CM and TDP president Nara Chandrababu Naidu
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి రేపో మాపో టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అధికార పార్టీ నేతలతో చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది.
గుర్నాథ్ రెడ్డి గురువారం లేదా శుక్రవారం రాజధాని అమరావతి వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. గుర్నాథ్ రెడ్డి చేరుతారని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలో బెంగ పట్టుకుంది. దీంతో హడావుడిగా సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తన ఆందోళన ఆయన ముందు వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మొదలు, గుర్నాథ్ రెడ్డి పార్టీలో ఎందుకు చేరుతున్నారో అధినేతకు పూసగుచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు కూడా ఆయన మాటలను సావధానంగా విన్నారు. నీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని అభయం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.