Prime Minister Narendra Modi along with United States President Donald Trumps's daughter and adviser Ivanka Trump inaugurated Global Entrepreneur Summit 2017 in Hyderabad
ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు హాజరయిన ప్రధాని మోదీకి, ఇవాంకలకు రోబోట్‘మిత్ర' స్వాగతం పలికింది. హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి మోదీ, ఇవాంక చేరుకోగానే వారిని మిత్ర పలుకరించింది.
ప్రధాని మోదీ, ఇవాంక వేదిక మీదకు రాగానే మిత్ర వారి వద్దకు వెళ్లి.. వారితో సంభాషించింది. వాళ్లు ఒక బటన్ ప్రెస్ చేయగా మిత్ర పాట పాడింది. కాగా హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంకా ట్రంప్ మంగళవారం ప్రారంభించారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మాట్లాడారు. అంతకుముందు, మోడీ, ఇవాంకాలు వేర్వేరుగా ప్రాంగణానికి చేరుకున్నారు. కాసేపు ఇద్దరు భేటీ అయ్యారు. ఇరుదేశాల విదేశాంగ శాఖ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సదస్సు ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సదస్సు ప్రారంభమయ్యాక ఇవాంకా మాట్లాడారు.