Vizag airport has scored the least and stands last among the 17 airports in the country being surveyed quarterly in terms of various service quality parameters.
ఉన్నత ప్రమాణాలను పాటించడంలో విఫలం కావడంతో విశాఖపట్నం విమానాశ్రయం దేశంలోని 17 విమానాశ్రయాల్లో చివరన నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) తరపున ఆఫ్ ది గ్లోబల్ బాడీ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్స్, ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) నిర్వహించిన క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ సర్వేలో ఈ విషయం తేలింది. ఉన్నత ప్రమాణాలను పాటించడంలో విశాఖపట్నం విమానాశ్రయానికి అత్యంత తక్కువ మార్కులే పడ్డాయి. జనవరి-మార్చిలో 4.04 స్కోరు చేయగా, ఏప్రిల్-జూన్‌లో 4.17, ఆగస్ట్-అక్టోబర్‌లో 3.97కు పడిపోయింది. విశాఖపట్నం కంటే మిగితా ఎయిర్‌పోర్టులు మెరుగ్గా స్కోరు చేయడం గమనార్హం.