Anam Vivekananda Reddy : Shocking Changes | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-25

Views 2

Amaravati: People who follow AP politics closely need not be told about Anam Vivekananda Reddy. His Nellore accent laced punch lines and his strange and weird dressing have drawn attention to him.

ఆనం వివేకానందరెడ్డి...రాజకీయాల గురించి ఏమాత్రం తెలిసినవారైనా వెంటనే గుర్తుపట్టగలిగిన నేత...సొంత జిల్లా నెల్లూరు అయినా తన ప్రత్యేక మేనరిజంతో రాష్ట్రమంతా సుపరిచితంగా మారారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు... ఒక్కమాటలో చెప్పాలంటే నా రూటే సపరేటు అని ఆనం వివేకా అన్నా అనకున్నా ఆయన గురించి తెలిసిన వారెవరైనా ఏకగ్రీవంగా ఆయనకు తగిలించే ట్యాగ్ లైన్ ఇదే... ఆనం తనదైన శైలిలో విసిరే నెల్లూరు యాసతో విసిరే పంచ్ డైలాగ్ లు , ప్రత్యేకంగా ఉండే వేషభాషలు, విచిత్రమైన మ్యానరిజం...తప్పయినా ఒప్పయినా బహిరంగంగానే చేసే తెంపరితనం...ఇలా ఇన్ని స్పెషాలిటీలు ఆనం వివేకానందరెడ్డి కే సొంతమనడంలో ఎలాంటి సందేహం లేదు...మాటలను తూటాల్లా పేల్చే ఆనం వివేకానందరెడ్డి తన స్వభావానికి విరుద్దంగా మౌనంగా ఉంటే చూసినవాళ్లు ఎవరైనా ఆశ్చర్యపోవడం ఖాయం.. ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయ నేతల పరిస్థితి అదే...
ఆనం వివేకానందరెడ్డి అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇటీవలే తన తల్లి మృతిచెందడంతో ఆనం వివేకా నెల్లూరుకు వచ్చారు. అలా వచ్చిన ఆనం వివేకానందరెడ్డిని చూసిన ఆయన అనుచరులు,అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS