Man lynched over illegal affair with a married woman in Yadagiri on Friday. deceased identified as Isak
వివాహిత మహిళతో రాసలీలల్లో మునిగిపోయిన యువకుడు ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు. చివరికి మహిళ భర్త, అతని కుటుంబ సభ్యులు యువకుడిని నగ్నంగా చెట్టుకు కట్టేసి అతి దారుణంగా చేసి చంపేశారు. వివాహిత మహిళ మీద దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.
కర్ణాటకలోని యాదగిరి తాలుకా హోసహళ్ళి గ్రామంలో ఏసుమిత్ర, నిర్మలా దంపతులు నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇసాక్ (32) అనే యువకుడు ఏసుమిత్ర భార్య నిర్మలాకు గాలం వేశాడు. నిర్మలా, ఇసాక్ కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు.
భార్య నిర్మలా విషయం తెలుసుకున్న ఏసుమిత్ర ఆమెను మందలించాడు. చుట్టుపక్కల వారికి విషయం తెలిస్తే కుటుంబం పరువుపోతుందని ఏసుమిత్ర భార్యను హెచ్చరించాడు. అయితే నిర్మలా, ఇసాక్ మాత్రం పద్దతి మార్చుకోలేదు. గురువారం ఏసుమిత్ర తాను ఊరికి వెలుతున్నానని భార్యను నమ్మించి వెళ్లాడు.గురువారం అర్దరాత్రి ఇసాక్ ప్రియురాలు నిర్మలా ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరూ నగ్నంగా రాసలీలలో మునిగిపోయారు. శుక్రవారం వేకువ జామున ఇంటికి వెళ్లిన ఏసుమిత్ర రాసలీలల్లో ఉన్న ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. భార్య నిర్మలాను చీర కట్టుకొమని ఏసుమిత్ర చెప్పాడు.
ఇసాక్ ను మాత్రం డ్రాయర్ కూడా లేకుండా అలాగే నగ్నంగా బయటకు తీసుకు వచ్చారు. గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఎదురెదురుగా ఉన్న రెండు చెట్లకు ఇసాక్, నిర్మాలను వేర్వేరుగా కట్టేశారు. తరువాత ఏసుమిత్ర, అతని కుటుంబ సభ్యులు కర్రలు, వైర్లు తీసుకుని ఇద్దరినీ చితకబాదేశారు. నగ్నంగా ఉన్న ఇసాక్ కు తీవ్రగాయాలు కావడంతో చెట్టుకు వేలాడుతూ మరణించాడు.