ఘనంగా నమిత పెళ్లి.. ఫొటోలు ఇవే..!

Filmibeat Telugu 2017-11-24

Views 9K

Namitha, a well-known actor in the south Indian film industry, began her acting career in 2002 with Sontham. Namitha wedding with Veerendra will take place at ISKCON, Tirupati on 24th November at 5.30 A.M. The wedding will be a private affair, both families and their friends invited for the marriage.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సినీతారగా పేరు సంపాదించుకొన్న అందాల భామ నమిత పెళ్లి తమిళ నటుడు వీరేంద్ర చౌదరితో జరగనున్న విషయం తెలిసిందే. శుక్రవారం (నవంబర్ 24న) తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
పెద్దలు, పండితులు నిర్ణయించిన ముహుర్తం వీరేంద్ర చౌదరీతో నమిత పెళ్లి శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ జరిగింది. ప్రముఖుల రాకతో సందడిగా మారడంతో భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
నమిత పెళ్లిలో భాగంగా జరిగే సంగీత్ కార్యక్రమం గురువారం (నవంబర్ 23న) రాత్రి తిరుపతిలోని ఓ ప్రయివేట్ హోటల్‌లో జరిగింది. రాత్రి 7: 30 ప్రారంభమైన కార్యక్రమం అర్థరాత్రి వరకు సాగింది.
తాజాగా బుధవారం జరిగిన మెహందీ, ఆ తర్వాత సంగీత్ కు ముస్తాబవుతున్న తన ఫోటోలను నమిత సోషల్ మీడియా లో షేర్ చేసింది. అయితే ఈ నేపధ్యం లో మీడియాలో నమిత పెళ్లి ప్రముఖంగా మారింది.
నమిత వివాహం కార్యక్రమంలో భాగంగా తిరుపతి పట్టణంలో సందడిగా భారీగానే కనిపిస్తున్నది. ఈ వివాహానికి తమిళ, తెలుగు రంగాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS