IT Companies Got Shock Over Rs 10,000 Crore Tax Demand

Oneindia Telugu 2017-11-23

Views 398

The tax department has raised service tax demand of about Rs 10,000 crore from information technology and IT-enabled services companies in the country, sending a shockwave through an industry already reeling under tighter US immigration laws and increasing automation.

దేశంలోని ఐటీ ఆధారిత కంపెనీలకు సర్వీస్ ట్యాక్స్ శాఖ నుంచి షాక్ తగిలింది. విదేశీ ఎగుమతులపై దాదాపు కంపెనీలు రూ.10వేల కోట్ల ట్యాక్స్ బకాయి పడ్డాయంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఐటీ కంపెనీలకు మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు.
దాదాపు 200కంపెనీలకు సర్వీస్ ట్యాక్స్ శాఖ నుంచి నోటీసులు జారీ చేశాయి. కేవలం పన్నుల చెల్లింపు మాత్రమే కాదు.. ఆలస్యం జరిగినందుకు వడ్డీ, జరిమానాలు కలిపి అదనంగా 15శాతం పన్ను చెల్లించాలని సర్వీస్ ట్యాక్స్ శాఖ పేర్కొంది. దీంతో పన్ను భారం మరింత పెరిగినట్టయింది.
2012-16 మధ్య కాలంలో ఆయా ఐటీ కంపెనీలు విదేశాలకు సాఫ్ట్‌వేర్‌ ఎగుమతి చేయడం ద్వారా పొందిన ప్రయోజనాల రిటర్న్స్ దాఖలు చేయాలని సర్వీస్ ట్యాక్స్ శాఖ నోటీసుల్లో పేర్కొంది. అయితే సాఫ్ట్ వేర్ వ్యవహారాలన్ని ఈమెయిల్ ద్వారానే జరుగుతాయి కాబట్టి వాటిని ఎగుమతులుగా పరిగణమించడం పట్ల కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS