A ruckus was created at Imphal Airport after a woman doctor lashed out at Union Minister of State for Electronics and Information Technology Alphons Kannanthanam, after her flight got delay due to VVIP arrival schedule at the airport.
విమానం ఆలస్యం కావడంతో ఓ కేంద్రమంత్రిని మహిళా డాక్టర్ అందరి ముందు గట్టిగా నిలదీసిన సంఘటన ఇంఫాల్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.
కేంద్ర ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సంస్కృతి, పర్యాటక శాఖల సహాయ మంత్రి అల్ఫోన్స్‌కు స్వయంగా ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇంఫాల్ విమానాశ్రయంలో వివిఐపి షెడ్యూలు కారణంగా విమానం బయలుదేరడంలో ఆలస్యమైంది.
దీంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అంతేకాదు వీవీఐపీ సంస్కృతి పైన వారు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ఇందులో ఓ మహిళా డాక్టర్ మాత్రం కేంద్రమంత్రిని గట్టిగా నిలదీశారు.
అక్కడకు వచ్చిన కేంద్రమంత్రి అల్ఫోన్స్‌తో ఆమె తీవ్రవాగ్వాదానికి దిగారు. ఆమె గట్టిగా మాట్లాడుతుంటే కేంద్రమంత్రి నిశ్చేష్టులై, సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
నేను ఓ వైద్యరాలిని అని, తాను సమయానికి వెళ్లకుంటే ఎలా అని, విమానాలను వీవీఐపీల కోసం ఇలా ఆలస్యంగా నడుపుతామంటే ఎలాగని కేంద్రమంత్రిని గట్టిగా నిలదీశారు. ఆమె మంత్రిని ఎండలో నిలబెట్టి మరీ కడిగిపారేశారు. వీవీఐపీల కారణంగా విమానాలు ఆలస్యమవుతున్నాయని మండిపడ్డారు.