Gujarat elections : Congress to give reservation to Patidars

Oneindia Telugu 2017-11-22

Views 100

Patidar Anamat Andolan Samiti (PAAS) leader Hardik Patel has made his political preference clear for the upcoming state Assembly polls in Gujarat.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌, పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పాస్‌) మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. పటీదార్ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించడంతో పటీదార్ ఉద్యమ నేత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇటీవల సీట్ల ఒప్పందం విషయంలో భేదాభిప్రాయాలు చోటుచేసుకోవడంతో పటేల్‌ వర్గీయులు ఇటీవల కాంగ్రెస్‌ కార్యాలయాలపై దాడి చేశారు. దీంతో పటేల్‌ వర్గం కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వబోదనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ తాము కాంగ్రెస్‌తోనే ఉంటామని హార్దిక్‌ పటేల్‌ స్పష్టం చేశారు.
తమ షరతులకు కాంగ్రెస్‌ ఒప్పుకొందని చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం కాంగ్రెస్‌తో ఒప్పందంపై హార్దిక్‌ పటేల్‌ సోమవారమేప్రకటన చేయాల్సింది. అయితే ఆందోళనల కారణంగా తన సభను రద్దు చేసుకొని బుధవారం ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌ తమ షరతులకు ఒప్పుకొందని.. పటేళ్లకు రిజర్వేషన్‌ కల్పించేందుకు అంగీకరించిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్‌ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెడతామని కాంగ్రెస్‌ చెప్పినట్లు హార్దిక్‌ వెల్లడించారు. దీనిపై ఆ పార్టీ తన మేనిఫెస్టోలో పూర్తి వివరాలను పేర్కొనాలని కోరినట్లు చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS