Hindupur Assembly seat in 2019 elections : బాలకృష్ణకు చెక్

Oneindia Telugu 2017-11-22

Views 1.4K

Ysrcp planning to win Hindupur Assembly seat in 2019 elections.Ysrcp searching for Boya caste candidate to contest from Hindupur segment.in 2019 elections.

2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపనుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం టిడిపికి కంచుకొటగా ఉంది. అయితే ఈ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా మరోసారి నందమూరి బాలకృష్ణ పోటీ చేయనున్నారు. అయితే వైసీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన నవీన్ నిశ్చల్‌ను మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.నవీన్ నిశ్చల్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవీన్ నిశ్చల్ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైసీపీ కూడ టిడిపికి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.
ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపురం నియోజకర్గంలో మంచి పట్టుంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్టీఆర్ గతంలో ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత నందమూరి హరికృష్ణ కూడ ఈ స్థానం నుండి విజయం సాధించారు. 2014 ఎన్నికల సమయంలో బాలకృష్ణ ఈ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. అయితే బాలకృష్ణను హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు సామాజిక సమీకరణాల ఆధారంగా టిడిపికి చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అయితే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వాల్మీకి బోయ సామాజిక వర్గం గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన నేతను 2019 ఎన్నికల్లో హిందూపురం నుండి బరిలోకి దింపాలని వైసీపీ నాయకత్వం ప్లాన్ చేస్తోందని ప్రచారం సాగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS