The rise in prices of vegetables have led to a increased demand for eggs which are rich in protein.Low production and Egg prices usually rise in winter.
పోషకాలతో నిండి రుచికరంగా ఉంటూ సామాన్యులను కష్టసమయంలో ఆదుకునే ఆహార పదార్ధం గుడ్డు. అయితే అలాంటి గుడ్డు ఇప్పుడు ఖరీదై జనాలకు అందుబాటులో లేకుండా పోయింది. గుడ్డు ధర ఇంతము ముందెన్నడూ లేని విధంగా ఒక్కో గుడ్డు ధర 6 రూపాయలు పలుకుతోంది.చలితీవ్రతఎక్కువగా ఉండడం, డిమాండ్‌కు సరిపడా గుడ్లు ఉత్పత్తి కాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని గుడ్ల వ్యాపారులుచెబుతున్నారు.ఈ ఏడాది జూలై నుంచి గుడ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జూలై నెలలో సరాసరి ఒక గుడ్డు ధర రూ.3.35 ఉండగా ఈనెలలో నవంబర్ 14వ తేదీ మంగళవారం నాటికి ఒక గుడ్డు ధర హోల్‌సేల్‌లో రూ.4.93గా నమోదైంది. ఆ తరువాత రోజురోజు 2 నుంచి 5 పైసల వరకు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సెల్ వ్యాపారులు మార్కెట్ ధర ప్రకారం గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికి రిటైల్ వ్యాపారులు మాత్రం డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఒక గుడ్డును రూ.5.30 నుంచి రూ.6 వరకువిక్రయిస్తున్నారు. ఇక మారుమూల గ్రామాలు, రవాణా సౌకర్యం అంతగా లేని గ్రామాల్లోనైతే ఒక గుడ్డు రూ.8 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.