బన్నీ కూతురు "అర్హ" ఫొటో పోస్ట్ కి.. లక్ష దాటిన ఫాలోవర్స్

Filmibeat Telugu 2017-11-21

Views 649

A couple of days ago, Allu Arjun revealed that he is going to enter into Instagram with a special post. Finally, he has come up with the picture of his daughter celebrating the birthday.

అల్లు అర్జున్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ .. బన్నీ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే తెలుస్తుంది. టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ? ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా తన ఫాన్స్ కు దగ్గరగా ఉన్న బన్నీ .. ఇప్పుడు వారికీ మరింత దగ్గరయ్యేందుకు సిద్ధం అవుతున్నాడు.
అల్లు అర్జున్ ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్‌లో బోలెడు క్రేజ్ వుంది. లక్షల్లో అభిమానులు వున్నారు. ఇప్పుడు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడు. ఫేస్ బుక్‌లో అతడి పేరిట ఉన్న పేజీకి ఏకంగా 1.26 కోట్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.
ట్విట్టర్లోకి కొంచెం లేటుగా వచ్చిన అతను అక్కడా 17 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఇప్పడు బన్నీ మరో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ ఇన్‌స్ట‌ాగ్రామ్‌లోకి కూడా వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ అతడి అకౌంట్ మొదలైపోయింది.
విశేషం ఏంటంటే.. బన్నీ ఇంకా అక్కడ ఒక్క అప్ డేట్ కూడా పెట్టలేదు. ఒక్క ఫొటో కూడా షేర్ చేయలేదు. అంతలోనే అతడి ఫాలోవర్ల సంఖ్య లక్షకు దాటిపోయింది. ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఫొటో పెట్టడానికి బన్నీ ఒక ముహూర్తం కూడా చూసుకున్నాడు. ఈ రోజే అతను అక్కడ తొలి ఫొటో షేర్ చేస్తాడట. దీని గురించి ముందే ప్రకటన కూడా చేశాడు బన్నీ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS