Kerala : Everything you need to know Before Traveling

Oneindia Telugu 2017-11-18

Views 109

The unique attractions and things to do in Kerala ensure that this tropical south Indian state is one of the most popular tourist destinations in India.

దేవుని ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది కేరళ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఉండే ప్రకృతి సౌందర్యాలు, మనోహరమైన దృశ్యాలు చూపరులను ఆకర్షిస్తాయి, మనస్సును కట్టిపడేస్తాయి. ఎంతో మంచి ప్రకృతి సుందరమైన వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. నోరురూరించే రుచులు, ఉల్లాసపరిచే వాతావరణం, ఎదో తెలియని ఆకర్షణ, ఇవన్నీ కేరళ రాష్ట్ర సొంతం. ఈ రాష్ట్రాన్ని మరియు అక్కడ ఉన్న వాతావరణాన్ని ప్రజలు ఎంతగా ఇష్టపడతారు అనే విషయాన్ని తెలియజేయడానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే, ఒక అధ్యయనం ప్రకారం చాలామంది ప్రజలు చివరిలో మరణించడానికి కేరళ ఉత్తమమైన ప్రదేశంగా భావిస్తున్నారట. వీటికి తోడు కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్ చేసుకోవడానికి కేరళకు ఎక్కువగా వస్తూ ఉంటారు. అందుకు కేరళ రాష్ట్రం ఎంతో ప్రసిద్ధి గాంచింది.
కేరళలో దాదాపు 5.45 లక్షల ఎకరాలలో సాగు చేయడానికి వీలుగా ఉండే భూమి ఉంది. దేశంలోనే అత్యధికంగా రబ్బరుని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానాన్ని సంపాదించింది. దేశంలో ఉత్పత్తి అయ్యే రబ్బరులో 90% కేరళ రాష్ట్రం నుండే వస్తుంది. కేరళ తర్వాత తమిళనాడులో అత్యధికంగా రబ్బరు ఉత్పత్తి జరగడం తో ఆ రాష్ట్రం రెండవ స్థానం లో ఉంది.కేరళ రాష్ట్రం నుండే 90% కు పై కొబ్బరి కాయలు ఉత్పత్తి అవుతాయి. దేశంలోనే అత్యధికంగా కొబ్బరి కాయలు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా పేరుని సంపాదించింది కేరళ.

Share This Video


Download

  
Report form