Indian all-rounder Hardik Pandya was on Friday rested from the first two Test matches against Sri Lanka, with the BCCI citing “heavy workload” as the reason despite his selection in the squad initially.
శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న సిరిస్‌కు మొదట తనను ఎంపిక చేసి ఆ తర్వాత విశ్రాంతినివ్వడంపై యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కారణంగా తన శరీరం కాస్త ఇబ్బంది పెడుతోందని, అందుకే తానే విశ్రాంతి అడిగానని పాండ్యా స్పష్టం చేశాడు. వంద శాతం ఫిట్‌గా ఉండి తాను పూర్తి స్థాయిలో ఆడగలనని భావించినప్పుడే బరిలోకి దిగాలనేదే తన ఉద్దేశమని, విశ్రాంతి సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు పాండ్యా వెల్లడించాడు. వచ్చే ఏడాది జరగనున్న దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.
శ్రీలంకతో తొలి రెండు టెస్టులకు జట్టులోకి ఎంపిక చేసి కూడా సెలక్టర్లు ఆ తర్వాత విశ్రాంతి పేరుతో పాండ్యాను పక్కన పెట్టడం విమర్శలకు దారి తీసింది. అందుకే హార్దిక్ పాండ్యా ఇలా స్పందించాడు