After ChandraBabu Naidu Who Is the key person In TDP

Oneindia Telugu 2017-11-10

Views 1.5K

Investors from dubai asked that Ap officials Who is the key person after Ap chiefminister Chandrababunaidu. Ap officials informed to investors full details of Chandrababunaidu .

టిడిపిలో చంద్రబాబునాయుడు తర్వాత ఎవరనే చర్చ తెరమీదికి వచ్చింది.అయితే రాజకీయపరంగా ఈ చర్చ రాలేదు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కొందరు ,పారిశ్రామిక వేత్తలు ఇటీవల కాలంలో ఈ విషయమై ఏపీ రాష్ట్రానికి చెందిన అధికారులతో చంద్రబాబునాయుడు పార్టీలో కీలకమైన నేత ఎవరనే విషయాన్ని తెలుసుకొని సంతృప్తి చెందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా 2014లో విడిపోయింది. అయితే ఏపీ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాల్లో విస్తృతంగా పర్యటించారు.
ఇటీవల కాలంలో చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనను పూర్తి చేసి అమరావతికి వచ్చారు. అయితే ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు ఆసక్తిని చూపారు. అయితే అదే సమయంలో కొన్ని సందేహలను అధికారుల వద్ద నివృత్తి చేసుకొన్నారు.
టిడిపిలో చంద్రబాబునాయుడు తర్వాత స్థానం ఎవరదనే విషయమై కొందరు పెట్టుబడిదారులకు అనుమానం వచ్చింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు ఏపీ అధికారులతో చర్చించారు.దుబాయ్ పారిశ్రామికవేత్తల నుంచి వాట్సాప్‌లో చిత్రమైన ప్రశ్నలు వచ్చాయి.రాష్ట్రంలో రాజకీయ స్ధిరత్వం ఉంటుందా? లేదా? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబే కీలకమా? బాబు తర్వాతి స్థానం ఎవరిది? ప్రభుత్వ నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇలాంటి సందేహలను వాట్సాప్‌లో సదరు పారిశ్రామికవేత్తలు పంపారు. ఈ ప్రశ్నలకు అధికారులు వాట్సాప్‌లో సమాధానాలు పంపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS