From handmade furniture to shampoo to sanitary ware to plywood, the prices of over 200 items may get cheaper. The all-powerful GST Council is meeting today in Guwahati and there are expectations the panel, headed by Finance Minister Arun Jaitley, could approve tax cuts on many common-use goods for the benefit of consumers and businesses.
జిఎస్టీ కౌన్సిల్ శుక్రవారం నాడు మరో200 వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు ఈ వస్తువుల కొనుగోలుపై ఇప్పటివరకు పడిన భారం తగ్గే అవకాశాలున్నాయి. ఆయా రాష్ట్రాల నుండి వస్తున్న సూచనల మేరకు జిఎస్టీ కౌన్సిల్ పన్నులను తగ్గిస్తూ వస్తోంది. కొన్ని వస్తువులపై పన్నులను యధాతథంగా ఉంచుతోంది. అయితే జిఎస్టీ అమలు తర్వాత ఆయా రాష్ట్రాల్లో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరోవైపు జిఎస్టీ అమల్లోకి వచ్చిన కొందరు వ్యాపారులు మాత్రం పాత పద్దతుల్లోనే సరుకులను విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిపై ఫిర్యాదు చేయాలని కూడ ప్రభుత్వం కోరుతోంది.