అనుష్కపై రాజమౌళి కామెంట్

Filmibeat Telugu 2017-11-08

Views 1.4K

Baahubali fame Anushka Shetty celebrating her birthday on November 7th. In this occassion, Director SS Rajamouli reacted on the twitter. He tweeted that Terrific.. Bhagamathie.. Baghamathi first look is become viral in the internet.
బాహుబలి చిత్రాల తర్వాత అనుష్క పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బాహుబలి ప్రభంజనంలో కొన్ని బాలీవుడ్ అవకాశాలు కూడా వచ్చాయనే వార్తలు కూడా వెలుగు చూశాయి. ఆ తర్వాత ప్రభాస్‌తో అఫైర్, పెళ్లి అంటూ మీడియాలో కథనాలు గందరగోళానికి దారి తీసాయి. ఆ తర్వాత సాహో చిత్రంలో ప్రభాస్‌తో నటించే అవకాశం చేజారింది. తాజాగా అనుష్క చేతిలో ఉన్న ఒకే చిత్రం భాగమతి. నవంబర్ 7వ తేదీని పురస్కరించుకొని భాగమతి ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌పై విశేష స్పందన వ్యక్తమవుతున్నది. ఈ ఫస్ట్ లుక్ గురించి ఎస్ ఎస్ రాజమౌళి ట్విట్టర్‌లో ఏమన్నారంటే..
భాగమతి చిత్రం ఫస్ట్‌లుక్‌ మతిపోయేలా ఉందని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా తెలుపుతూ పోస్టర్‌ను పంచుకున్నారు. టెర్రిఫిక్ భాగమతి అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
భాగమతి ఫస్ట్‌లుక్‌లో అనుష్క అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఒక చేతిలో రక్తం మరకలతో కూడిన సుత్తిని పట్టుకొని, మరో చేతికి గాయం కావడంతో కారుతున్న రక్తం భయంకరంగా ఉన్నాయి. ఈ ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Share This Video


Download

  
Report form