Ashish Nehra's farewell match will form the subplot as India aim to better their abysmal T20 record against New Zealand in the three-match series starting here on Wednesday (November 1).
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరిస్ ముగిసింది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు కోహ్లీసేన స్వదేశంలో రెండు టీ20 సిరీస్‌లు రెండు మాత్రమే అడింది. అందులో ఒకటి జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్ కాగా, రెండోది గత నెలలో ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టీ20ల సిరిస్. ఈ రెండు టీ20 సిరీస్‌ల్లో భారత్‌కు ప్రత్యర్థి జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 2-1తో గెలిచిన కోహ్లీ సేన, ఆస్ట్రేలియాతో జరిగిన సిరిస్‌ను మాత్రం 1-1తో సమం చేసుకుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కూడా ఈ మూడు టీ20ల సిరిస్‌లో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. అంతేకాదు న్యూజిలాండ్‌తో తలపడిన ఏ టీ20లోనూ భారత్‌కు విజయం సాధించలేదు. 2007 నుంచి చూస్తే కివీస్‌తో భారత్ ఐదు టీ 20ల్లో తలపడగా అన్నింట్లోనూ ఓటమి పాలైంది.